Sunday, December 22, 2024

హాకీ స్టార్ శ్రీజేశ్‌కు రూ.2 కోట్ల నజరానా

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: భారత హాకీ స్టార్, సీనియర్ గోల్ కీపర్ ఆర్‌పి శ్రీజేశ్‌కు భారీ నగదు పురస్కారం లభించింది. ఇటీవల పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ ఈ పతకం సాధించడంలో శ్రీజేశ్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. దీంతో దేశ వ్యాప్తంగా శ్రీజేశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా, ఒలింపిక్స్ ముగిసిన వెంటనే శ్రీజేశ్ హాకీకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ వెంటనే భారత హాకీ సమాఖ్య శ్రీజేశ్‌ను జూనియర్ టీమ్ ప్రధాన కోచ్‌గా నియమించింది. ఇదిలావుంటే భారత హాకీ ఎంతో విలువైన సేవలను అందించిన శ్రీజేశ్‌ను కేరళ ప్రభుత్వం భారీ నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది.

శ్రీజేశ్‌కు రెండు కోట్ల రూపాయల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళకు చెందిన శ్రీజేశ్ దాదాపు 20 ఏళ్ల పాటు భారత హాకీకి సేవలు అందించాడు. అతని ఖాతాలో రెండు ఒలింపిక్ పతకాలు ఉన్నాయి. అంతేగాక ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు సాధించిన భారత జట్టులో శ్రీజేశ్ సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌కు లభించిన అత్యుత్తమ హాకీ ఆటగాళ్లలో శ్రీజేశ్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక అసాధారణ ఆటతో కేరళతో పాటు దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసిన శ్రీజేశ్‌ను ఘనంగా సత్కరించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News