భునవేశ్వర్: ప్రపంచకప్ హాకీలో భాగంగా ఆదివారం జరిగే క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచే టీమ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటుంది. లీగ్ దశలో గ్రూప్‌డిలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయింది. ఇక న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌కు ముందుకు వెళుతుంది. ఒకవేళ ఓడిపోతే టైటిల్ రేసు నుంచి వైదొలగక తప్పదు.
క్వార్టర్ ఫైనల్లో బెల్జియంను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక కివీస్‌తో పోల్చితే భారత్ కాస్త బలంగా ఉందని చెప్పాలి. కానీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బలహీనమైన వేల్స్‌ను ఓడించేందుకు భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇలాంటి స్థితిలో న్యూజిలాండ్‌ను ఓడించడం అనుకున్నంత తేలిక కాదనే చెప్పాలి. కానీ సొంత గడ్డపై ఆడుతుండడం భారత్‌కు కలిసివచ్చే అంశంగా చెప్పాలి. లీగ్ దశలో స్పెయిన్‌ను ఓడించడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.