Wednesday, January 22, 2025

హైదరాబాద్ లో మొదలైన హోలీ సందడి..

- Advertisement -
- Advertisement -

దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ హోలీ సంబరాలు మొదలయ్యాయి. ఈరోజు ఉదయం ఇళ్ల నుంచి బయటకు వచ్చి పిల్లలు, యువతతోపాటు కుటుంబ సభ్యులు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ.. రంగు రంగుల నీళ్లు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు.

ఇక, హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచే హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. చిన్నా పెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతూ హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా, సంబరంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఆట, పాటలతో యువత రచ్చ చేస్తున్నారు. దీంతో నగరంలోని వీధులు సందడిగా మారాయి. హోలీని ఎంతో హుషారుగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News