రంగులతో సప్తవర్ణ శోభితమైన భాగ్యనగరం
హైదరాబాద్: నగరంలో హోళీ వేడుకలు మిన్నాంటాయి. హోళి వేడుకులను ప్రశాంతంగా జరిగాయి. కుల ,మతలకు అతీతంగా నగర వాసులు హోళి వేడుకలను ఆనందోత్సహాలలో మునిగి తేలారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా హోళికి దూరంగా ఉన్న నగరవాసులు ఈ ఏడాది కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకోనడంతో రెట్టించిన ఉత్సాహంతో హోళీని జరుపుకున్నారు. చిన్న పెద్ద అన్నా తేడా కుండా ఒక్కరిపై ఒక్కరు రంగులు చల్లుకున్ని పర్వశించి పోయ్యారు. దీంతో నగరంలో రంగుల వాన కురిసి సప్తవర్ణశోభితమైంది.
రోడ్లు, పార్కులు బస్తీలు అపార్టుమెంట్లు ఎక్కడా చూసిన రంగులు పూసుకుంటూ కేరింతలు, ఆట పాటాలతో మునిగి తెల్లారు. నెక్లెస్ రోడు, తో పాటు ప్రధాన పార్కులు, హోటళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోళీ సంబరాలల్లో ఐటి ఉద్యోగులు, ఉద్యోగులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆట పాటాలతో సరదాగా గడిపారు. అదేవిధంగా నగరంలోని పలు అపార్టుమెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోళి వేడుకల్లో అపార్టుమెట్ల వాసులు ఉత్సాహాంగా పాల్గొని సరదా సరదా గడిపారు. ఇక బస్తీల్లో హోళీ సంబురాలు వెల్లువిరిసాయి. బస్తీలకు బస్తీలే రంగుల మయం అయ్యాయి. నగరంలోని పాటు వివిధ పార్టీ నాయకులు, మంత్రులు, హోళి వేడుకులను ఘనంగా జరుపుకున్నారు.
విశ్వవిద్యాలయాలో ఘనంగా హోళి విద్యార్థులు..
నగరంలోని పలు విశ్వవిద్యాలయాల్లో హోళి సంబురాలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హోళి సందర్భంగా దూంధాం నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు హోళీ వేడుకల్లో మునిగి తేలారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వివిధ రాష్ట్రాల చెందిన విద్యార్థులు చదువుకుంటుడడంతొ ఇక్కడ హోళి వేడుకలను ఉత్సాహభరింతగా జరుపుకున్నారు. అదేవిధంగా నగంరలోని శివారు ప్రాంతాల్లో ఉన్న పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో హోళి వేడుకలను విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు.
పోలీసుల ఆంక్షాలు..
హోళి వేడుకలు శృతి మించకుండా పోలీసులు కొన్ని ఆంక్షలను విధించారు. బహిరంగ ప్రదేశాల్లో హోళి వేడుకలను నిషేధించారు. అదేవిధంగా హోళి పేరుతో అపరిచితులలపై రంగులు చల్లడం కాని, భవనాలు, రోడ్డుపై వెళ్లుతున్న వాహనదారులపై రంగులు వేయరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో యువత హోళి సంబురాలల్లో ఎక్కడ శృతి మించకుండా ప్రశాంతంగా జరుపుకున్నారు.
హోళీ వేడుకల్లో అపశృతి..
నగరంలోని పివి నరసింహరావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన హోళీ సంబురాల్లో అవశృత్తి చోటు చేసుకుంది. హోళీ పండుగను పురస్కరించుకుని వికె.ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా టమాటా గేమ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా యువత భారీ సంఖ్యలో ఈ గేమ్‌లో పాల్గొనడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అఅని వెంటనే ఆసుపత్రికి తరలించారు.అనుమతికి మించిన ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం.