- Advertisement -
ఈనెల 14న హైదరాబాద్‌లో నిర్వహించనున్న హోలీ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. జెఎస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో రంగోలి 2025 పేరుతో ఈ వేడుకలు జరగనున్నాయి. నిర్వాహకులు శరత్, జిబిన్ తోపాటు నటీమణులు కీర్తి క్వీన్, మేఘనా చౌదరి, మేరీ సింథియా, సూరజ్, రమ్య పాల్గొన్నారు. ఆర్గనైజర్ శరత్ మాట్లాడుతూ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పిల్లలతో కలిసి హోలీ జరుపుకోవాలని కోరారు. పిల్లల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఉన్నాయని, ప్రధాన థీమ్ రెయిన్ డ్యాన్స్ ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్చి 14న ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హోలీ వేడుకలు జరుగుతాయని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని వాకిన్ స్ట్రీట్ డ్రైవ్‌లో మీ కుటుంబంతో వచ్చి హోలీ సెలబ్రేట్ చేసుకోవాలని కోరారు.
- Advertisement -