Monday, December 23, 2024

జోగిపేటలో హోలీ సంబరాలు

- Advertisement -
- Advertisement -

జోగిపేటః హోలీ పండగను అందోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జోగిపేట పట్టణంలో యువకులు, చిన్నారులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబరాలు ఘనంగా జరిగాయి. మండలంలోని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేతో కలిసి రంగులు జల్లుకుంటు పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

పట్టణంలో ప్రతి కాలనీలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం నుంచి చిన్నారులు మాత్రంలో రంగుల్లో మునిగితేలారు. ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పోటీ పడ్డారు. వేషాధారణలో కొందరు పట్టణంలో డప్పుచప్పుడుతో డప్పులు అడుగుతూ ఇంటింటికి, వ్యాపారుల వద్దకు తిరిగారు. యువకులు బైక్‌లపై పట్టణంలో తిరుగుతూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News