- Advertisement -
తెలంగాణ ప్రభుత్వం మహాశివరాత్రినాడు సెలవు ప్రకటించింది. మార్చి 8 శుక్రవారంనాడు శివరాత్రి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రమే కాకుండా పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించింది. దీంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవు లభించినట్లయింది. మార్చి 9 రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవే. ఆ మర్నాడు ఆదివారం కావడంతో వరసగా మూడు రోజులు సెలవు దినాలే! కాగా ఇదే నెలలో మార్చి 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే కావడంతో మరో రెండు రోజులు సెలవులు లభించాయి.
- Advertisement -