Monday, December 23, 2024

ప్రపంచంలోనే అత్యంత అందమైన నటి మృతి..

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తింపు పొందిన ఇటాలియన్ నటి జినా లొలోబ్రీగిడా(95) సోమవారం మరణించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. ఇటలీలోని సుబియాకో సిటీలో 1927, జూలై 4న జన్మించిన జినా.. చిన్న వయసులోనే ఇటాలియన్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు హాలీవుడ్ మూవీస్ లో స్టార్ హీరోలతో జతకట్టి అలరించిన జినా.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.

20ఏళ్లకే స్లోవేనియన్ డాక్టర్ ని జినా పెళ్లి చేసుకుంది. కొడుకు పుట్టిన తర్వాత తన భర్తతో విడిపోయింది. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి విఫలమైంది. 2006లో, 79ఏళ్ల జినా.. 34ఏళ్లు చిన్నవాడైన తన స్పానిష్ పార్ట్ నర్ ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, ఒక సంవత్సరం తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుని పబ్లిక్ లైఫ్ కు దూరంగా ఉన్నారు. వయసు రిత్యా ఎదురైనా అనారోగ్య కారణాలతో బాధపడుతూ జినా లొలోబ్రీగిడా సోమవారం కన్నుమూశారు. జినా అంత్యక్రియలను గురువారం చర్చిలో నిర్వహించనున్నారు.

Hollywood Actress Gina Lollobrigida passed away at 95

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News