Thursday, January 23, 2025

కాలినడకన ఉక్రెయిన్ వీడిన హాలీవుడ్ దర్శకుడు

- Advertisement -
- Advertisement -

Hollywood director who left Ukraine on foot

 

రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని డాక్యుమెంటరీగా తీయాలని వెళ్లిన ఓ హాలీవుడ్ నటుడికి పరిస్థితులు అనుకూలించలేదు. ఫలితంగా ఉక్రెయిన్‌ను కాలినడకన వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఆ దేశాన్ని వదిలి కాలి నడకన వెళుతున్న ఫొటోను సోషల్ మీడియాలో అతడు షేర్ చేశాడు. అమెరికాకు చెందిన సీన్ పెన్ టెలివిజన్‌లో కెరీర్ ఆరంభించి అనంతరం నటుడిగా మారాడు. పలు చిత్రాలకు దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్‌గా పని చేశాడు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని డాక్యుమెంటరీగా షూట్ చేసేందుకు గతేడాది నవంబర్‌లో కీవ్‌కు వెళ్లాడు. ఉక్రెయిన్ మిలిటరి సిబ్బందితో మాట్లాడి డాక్యుమెంటరీని షూట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ షూట్ జరుగుతుండగానే రష్యా, ఉక్రెయిన్‌పై దండెత్తింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News