- Advertisement -
హాలీవుడ్ లో విషాదం నెలకొంది. విమాన ప్రమాదంలో హాలీవుడ్ హీరో క్రిస్టియన్ ఒలివర్ మృతి చెందారు. గురువారం ఆయన తన ఇద్దరు కూతుర్లు అన్నిక్(12), మదితా(10)తో కలిసి ప్రైవేట్ విమానంలో గ్రెనడైన్స్ దేశం సెయింట్ విన్సెంట్ నుంచి తూర్పు కరేబియన్ ద్వీపం లూసియాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వారు ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు ఇద్దరు కూతుర్లు, పైలట్ కూడా మరణించినట్లు రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీస్ ఫోర్స్ తెలిపింది.
కోస్ట్ గార్డ్ సిబ్బంది నలుగురు మృతదేహాలను వెలికితీశారని.. పోస్ట్ మార్టం కోసం సెయింట్ విన్సెంట్ ద్వీపానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విమానం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదని.. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు.
- Advertisement -