Sunday, December 22, 2024

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మహాపూర్ణాహుతితో ముగిసిన పవిత్రోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు శనివారం రాత్రితో మహాపూర్ణాహుతితో వైభవంగా ముగిశాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం యాగశాలపూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, మూలవర్లకు కలశాభిషేకం, పట్టుపవిత్ర సమర్పణ చేపట్టారు. సాయంత్రం పంచమూర్తులైన  సోమస్కందమూర్తి, కామాక్షి అమ్మవారు,  విఘ్నేశ్వరస్వామి, వళ్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి,  చండికేశ్వరస్వామివారి వీధి ఉత్సవం ఘనంగా నిర్వ‌హించారు. పవిత్రోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు పవిత్రమాల, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఇఒ దేవేంద్ర‌బాబు, ఎఇఒ సుబ్బరాజు, సూప‌రింటెండెంట్ కృష్ణ వర్మ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ బాలకృష్ణ, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News