Wednesday, January 22, 2025

రైలులో బాలికతో హోంగార్డు అసభ్య ప్రవర్తన

- Advertisement -
- Advertisement -

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ కుటుంబం స్లీపర్ క్లాస్‌లో వస్తోంది. నిందితుడు నిద్రిస్తున్న బాలిక వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక వెంటనే తన తండ్రికి ఈ విషయం తెలియజేయగానే, అతను రైల్వే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కాచిగూడ పోలీసులను అలెర్ట్ చేశారు.

ట్రైన్ కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే రైల్వే పోలీసులు ప్రతాప్‌ను అరెస్టు చేశారు. నిందితుడు హోంగార్డు యూనిఫాంలో ఉండి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ప్రతాప్ ఆంధ్రప్రదేశ్‌లోని కోడూరు పోలీసుస్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడి స్వస్థలం కడప జిల్లా రైల్వే కోడూరు. అతనిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News