Monday, December 23, 2024

ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… జైనుల్లాద్దిన్ అహ్మద్(30) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఓ రిటైర్డ్ ఐపిఎస్ అధికారి వద్ద పనిచేస్తున్నాడు.

వేతనాలు నెలనెలకు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News