హైదరాబాద్: కుటుంబకలహాలకు జీవితంపై విరక్తి చెందిన విషం తీసుకుని హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. సైఫాబాద్ పోలీసుల కథనం ప్రకారం సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన గుంటూరు జిల్లా రేపల్లే గ్రామానికి చెందిన నాగరాజు ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో ఆటోలో కూర్చుని విషం తీసుకున్నాడు. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇటీవలే నాగరాజు హార్స్ రైడింగ్ కేంద్రానికి బదిలీ అయ్యాడు. కుటుంబ కలహాలవల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆటోలో మృతిచెంది ఉన్న హోంగార్డును చూసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Home Guard Commits Suicide in Hyderabad