Friday, November 22, 2024

విధి నిర్వహణలో హోంగార్డు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లారీ ఢీకొట్టడంతో ఓ హోంగార్డు మృతిచెందిన సంఘటన అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం…వికారాబాద్ జిల్లా, కుల్కచర్ల మండలం, చాపలగూడెం గ్రామానికి చెందిన గాండి శ్రీనివాస్(35) 2008 నుంచి హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాధితుడికి భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా మేడ్చల్ రహదారిపై లారీలను ఆపుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ లారీని ఆపేందుకు వెళ్లగా డ్రైవర్ ఆపకుండా ఒక్కసారిగి హోంగార్డును ఢీకొట్టాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన హోంగార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అక్కడే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వెంటనే అస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హోంగార్డును ఢీకొట్టిన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News