Thursday, January 23, 2025

తప్పిపోయిన వృద్ధురాలికి హోంగార్డు సాయం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తాను వెళ్లాల్సిన ప్రాంతాన్ని మర్చిపోయి రోడ్డుపై తిరుగుతున్న వృద్ధురాలికి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు సాయం చేశాడు. కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అశోక్ అక్కడే ఓ వృద్ధురాలు తప్పిపోయి తిరుగుతోందని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్లిన అశోక్ వృద్ధురాలిని వివరాలు అడిగాడు.

Also read: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

తనది ఎపిలోని భీమవరం అని తన పేరు జానకమ్మ(80) చెప్పింది. మధ్యాహ్నాం కావడంతో అప్పటికే వృద్ధురాలు ఆకలితో అలమటిస్తోంది, వెంటనే హోంగార్డు భోజనం, వాటర్ బాటిల్ తెప్పించి ఇచ్చాడు. వృద్ధురాలు భోజనం చేసిన తర్వాత ఆమెను పెట్రోలింగ్ సిబ్బందికి అప్పగించడంతో గమ్యస్థానానికి చేర్చారు. వృద్ధురాలి ఆకలి తీర్చి తన వారి వద్దకు చేర్చిన హోంగార్డు అశోక్‌కును స్థానికులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News