Sunday, December 22, 2024

హోంగార్డు పైకి దూసుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

కారు భీభత్సం సృష్టించిన సంఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఎప్పటి మాదిరిగానే వాహనాల తనిఖీ చేస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా, బ్లాక్ ఫిల్మ్ ఉన్న కారు వస్తుండగా హోంగార్డు రమేష్ ఆపేందుకు యత్నించాడు. కాని కారు నడుపుతున్న వ్యక్తి సయ్యద్ ఆపకుండా హోంగార్డు రమేష్‌పైకి కారును దూకించాడు. దీంతో హోంగార్డును కారు కొంత దూరం ఈడ్చుకుని వెళ్లింది. తర్వాత కారు ఆపడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్సై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News