Monday, December 23, 2024

ఆర్థిక మంత్రికి హోంగార్డుల వినతిపత్రం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావును హోంగార్డులు కోరారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావును ఆయన ఇంటి వద్ద కలిసి హోం గార్డుల సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తమను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మేరకు హామీ ఇచ్చారని తెలిపారు. వెంటనే కారుణ్యయ నియామకాలు చేపట్టాని, హోంగార్డుల సమస్యలు మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ హోంగార్డుల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్, తాహెర్ మొహ్మద్, రావు మహేందర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News