Wednesday, January 22, 2025

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను కలిసిన హోంగార్డులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం అయ్యేలా చూడాలని హోంగార్డులు ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసీని కోరారు. ఈ మేరకు ఆదివారం ఎమ్మెల్యేను తన నివాసంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరారు.

హోంగార్డుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని, అసెంబ్లీలో హోంగార్డుల సమస్యలపై మాట్లాడతానని చెప్పారని సైబరాబాద్ హోంగార్డ్ అధ్యక్షుడు అశోక్ తెలిపారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌కు హోంగార్డులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హోంగార్డులు మన్మధరావు, శంకర్‌నాయక్, బాలకృష్ణ, గోపాల్, భాస్కర్, జానీ మియా, వికారాబాద్ జిల్లా హోంగార్డు చాంద్‌పాషా, ఏడుకొండలు, తాహిర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News