Sunday, February 2, 2025

కశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులపై ఏం చేద్దాం

- Advertisement -
- Advertisement -

Home Minister Amit Shah chairs security review meet

ఆర్మీచీఫ్ , ఇతరులతో అమిత్ షా సమీక్ష

శ్రీనగర్ /న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, పలు కేంద్ర సంస్థల అధినేతలతో కీలక సమావేశం నిర్వహించారు. జమ్మూ కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో వరుసగా ఉగ్రవాద దాడులు జరగడం, కశ్మీర్ పండిట్ల హత్యలతో తలెత్తుతున్న పరిణామాలను వేర్వేరు స్థాయిల్లో ఆయన అధికారులతో సమీక్షించారు. కశ్మీర్ లోయలో ఓ బ్యాంకు మేనేజర్ సహా ఇద్దరు వ్యక్తులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటన తరువాత మరుసటి రోజు అమిత్ షా ఢిల్లీలో ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి దిగారు. చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి, ఉగ్రవాదుల అణచివేత గురించి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో వారం రోజుల వ్యవధిలోనే ఎనమండుగురు ఉగ్రవాదుల తూటాలకు బలి కావడం ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేని శాంతిభద్రతల క్షీణ పరిస్థితిని తెచ్చిపెట్టింది.

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను, కశ్మీర్ ఉన్నతాధికారులను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. సమావేశంలో ఆర్మీచీఫ్, ఎన్‌ఎస్‌ఎ ఇతరులు పాల్గొనడంతో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సిఆర్‌పిఎఫ్, బిఎస్‌ఎఫ్ ఇతర సంస్థల అధినేతలు కూడా సమీక్షకు వచ్చారు. ఇటీవలి కాలంలో పలు ప్రాంతాలలో హిందువులను అందులోనూ ఉద్యోగవర్గాలను లక్షంగా ఎంచుకుని ఉగ్రవాదుల దాడులు జరుగుతున్నాయి. మరో వైపు సెలవుపై ఉన్న ఓ పోలీసు, ఓ టీవీ నటిపై కాల్పులు జరిపి వారిని చంపేశారు. వీరు ముస్లింలు. అమిత్ షా అంతకు ముందు ఇంటలిజెన్స్ అధికారులతో పరిస్థితిని తెలుసుకున్నారు. ఒక్కరోజు క్రితమే అజిత్ ధోవల్‌తో ముఖాముఖి భేటీ జరిపారు. ఈ క్రమంలోనే అత్యున్నత స్థాయి సమావేశం జరిపారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News