Monday, December 23, 2024

మణిపూర్‌లో మూడు రోజుల బసః షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు తాను త్వరలోనే వెళ్లి అక్కడ మూడు రోజులు ఉంటానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. మణిపూర్‌లో తిరిగి ఇటీవల ఘర్షణలు చెలరేగి, కర్ఫూ పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో అమిత్ షా స్పందించారు. అక్కడ శాంతిభద్రతలను పరిరక్షించాల్సి ఉంటుంది.

తాను స్వయంగా అక్కడికి వెళ్లి వివిధ వర్గాల ప్రజలతో వారి ప్రతినిధులతో మాట్లాడుతానని తెలిపారు. కోర్టు తీర్పు తరువాత అక్కడ శాంతిభద్రతల పరిస్థితి క్షీణించింది. తలపడుతున్న ఇరు వర్గాల వారితో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడికి వెళ్లుతున్నట్లు వివరించారు. అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎస్‌టి తెగలోకి మైతీ కులాన్ని చేర్చడం పట్ల అక్కడి కుకీ ప్రజల నిరసన ఘర్షణలకు దారితీసి, మణిపూర్‌లో పరిస్థితిని దెబ్బతీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News