- Advertisement -
అమరావతి: గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను విఆర్ లో ఉంచిందని ఎపి హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులను విఆర్ లో ఉంచడంపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు అనిత సమాధానాలు ఇచ్చారు. విఆర్ లో ఉన్న పోలీసులకు గత ప్రభుత్వం జీతం ఇవ్వలేదని విమర్శించారు. పోలీసులను విఆర్ లో ఉంచితే గతంలో 50 శాతం జీతం ఇచ్చేవారన్నారు. కక్షపూరితంగా గత ప్రభుత్వం పోలీసులను విఆర్ కు పంపిందని, కొందరు పోలీసులకు గత ప్రభుత్వం 3-4 ఏళ్లు జీతాలు ఆపిందని వెల్లడించారు. ఉద్యోగిపై విఆర్ ను ఎత్తివేయగానే పెండింగ్ వేతనం ఇస్తున్నామని, విఆర్ లో ఉన్న పోలీసులకు వేతనం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
- Advertisement -