Friday, December 20, 2024

విద్వేషాలు రెచ్చగొట్టేందుకే జగన్ ప్రయత్నం:హోంమంత్రి అనిత

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల పర్యటన రద్దుకు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చెప్పినవన్నీ కుంటి సాకులేనని హోంమంత్రి అనిత మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని దుయ్యబట్టారు. లడ్డూ రుచిపై మాట్లాడిన జగన్ ఏరోజైనా తిరుమల లడ్డూ తిన్నారా? అని ప్రశ్నించారు. జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెట్టేస్తారని, జగన్ తలపై అక్షింతలు వేస్తే దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని అనిత వివరించారు. డిక్లరేషన్ ఇవ్వమంటే దళితుల అంశాన్ని ముడిపెడుతున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని, మానవత్వంపై జగన్ మాట్లాడుతుంటే ఆ పదమే సిగ్గు పడుతుందని, జరిగిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు జగన్ తంటాలు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ దేశాన్ని కించపరిచేలా మాట్లాడమేంటని అనిత ప్రశ్నించారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జగన్ ను దేశం నుంచి బహిష్కరించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News