హైదరాబాద్: మహిళల వస్త్రధారణపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి డిమాండ్ చేశారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మహిళలు నెత్తి మీద హిజాబ్ ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని మాట్లాడడం మహిళలను అవమానించడమేనని మండిపడ్డారు. ఆరు నెలల పసిపాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఎప్పుడు నోరు మెదపని హోంమంత్రి మహిళల వస్త్రధారణ వాటికి కారణం అన్నట్లుగా మాట్లాడడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించటమే, కించపరచడమేనిని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసి పిల్లలపై, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపై రోజుకు సగటున ఏడు ఫోక్సో కేసులు కేసులు నమోదయితున్నాయి. దానికి కూడా వస్త్రధారణ కారణమా, బాధ్యత లేని హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు.
మహిళ వస్త్రదారణపై వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి క్షమాపణ చెప్పాలి: రుద్రమదేవి
- Advertisement -
- Advertisement -
- Advertisement -