Monday, December 23, 2024

త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన హోం మంత్రి మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో ముందజలో ఉందన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను మంత్రి సన్మానించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, జిల్లా ఎస్పీ రమణ కుమార్,అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, డిఆర్ఓ నగేష్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News