కాచిగూడ : మహిళల వస్త్రధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ ఆలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శి డా.కోట నీలిమ డిమాండ్ చేశారు. ఆదివారం ఆమే ఒక ప్రకటనలో పేర్కొంటూ.. నగరంలోని ఓ పరీక్షా కేంద్రంలో కొందరు ముస్లీం విద్యార్థినులను తమ బురఖాలను తొలగించాలని సిబ్బంది కోరిన సంఘటనపై హోంమంత్రి మాట్లాడారు. మహిళలు చిల్లర బట్టలు ధరించినప్పుడు సమస్యలు ఎదురైతాయని నీచంగా మాట్లాడడం సిగ్గు చేటని ఆమే మండిపడ్డారు.
తాలిబన్ ఆలో చనలతో మహిళలను కించపరిస్తే ఉరుకొరని తరమికొడతారని, మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా అని మహమూద్ ఆలీని ప్రశ్నించారు. ప్రతి మహిళకు వారి కోరిక మేరకు దుస్తులు ధరించే హక్కు ఉంటుందని, మహిళలకు దిశానిర్దేశం చేసే హక్కు హోమంత్రికి లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్య లు తీసుకోవాల్సిన హోంమంత్రి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించేదిలేదని ఆమే ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించిన హోంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని ఆమె ప్రభుత్వాని డిమాండ్ చేశారు.