Wednesday, January 22, 2025

పోలీస్ శాఖ వివిధ విబాగాల ప్రదర్శనను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ , జూన్ 4 : తెలంగాణా రాష్ట్రం ఉన్న శాంతి భద్రతల పరిస్థితులు, తెలంగాణా పోలీసులు ఉపయోగిస్తున్న ఆధునాతన సాంకేతిక పరికరాలు దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ చర్చనీయాంశంగా మారాయని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సురక్ష దినోత్సవాన్ని పురస్కరించుని డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ విబాగాలు, జైళ్లు, అగ్నిమాపక శాఖ లకు చెందిన స్టాళ్లు, ప్రదర్శనను హోమ్ మంత్రి ఆదివారం ప్రారంభించారు. డిజిపి అంజనీ కుమార్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పధంలో పయనించడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి భేషుగ్గా ఉండడమేనని అన్నారు.

Also Read: ఘోర విషాదం

దీనికి కారణం రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పోలీస్ శాఖ కు ఇస్తున్న ప్రాధాన్యతనేనని అన్నారు. డిజిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ, నేర పరిశోధన లో తెలంగాణా పోలీస్ ఉపయోగిస్తున్న ఆధునిక పరికరాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవని అన్నారు. తెలంగాణా పోలీస్ శాఖలోని 80 వేలకు పైగా పోలీసు అధికారుల నిర్విరామ అకుంఠిత దీక్ష వల్లనే రాష్ట్రంలో శాంతీయుత పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కాగా, అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన పోలీస్, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలకు చెందిన పనితీరును తెలిపే ఈ ప్రదర్శనను రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

డిజిపి అంజనీ కుమార్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఫైర్ శాఖ డిజి నాగి రెడ్డి, అడిషనల్ డిజిలు మహేష్ భగవత్, విజయ్ కుమార్, షికా గోయల్, అభిలాష బిస్త్, స్వాతి లక్రా, సంజీవ్ కుమార్ జైన్, సందీప్ శాండిల్య, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సిపి డి.ఎస్. చౌహాన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌరుల భద్రతపై పోలీస్ శాఖ చేపట్టిన పలు అంశాలను తెలియ చేసే ప్రదర్శనలు ఆహుతులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం సందర్భంగా సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫీటి లపై పోలీస్ శాఖ టాస్క్ (టిఎఎస్‌కె) ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. టాస్క్ సిఇఒ శ్రీకాంత్ సిన్హా, ఐజీ రమేష్ రెడ్డి, విశ్వజిత్‌లు ఈ అవగాహన ఒప్పందాలపై సoతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News