Monday, December 23, 2024

తలసాని బొకే కోసం గన్‌మెన్‌కు చెంపదెబ్బ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః మంత్రి తలసాని కోసం హోం మంత్రి మహమూద్ అలీ తన వద్ద పనిచేస్తున్న కానిస్టేబుల్(గన్‌మెన్) చెంప చెళ్లుమనిపించాడు. ఈ సంఘటన అమీర్‌పేట డికె రోడ్డులోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ అమీర్‌పేటలోని డికె రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వచ్చారు.

శుక్రవారం మంత్రి తలసాని పుట్టిన రోజు కావడంతో హోమంత్రి మహమూద్ అలీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత బోకే ఎక్కడ అని తన సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. తనకు బోకే గురించి తెలియదని సిబ్బంది చెప్పడంతో సహనం కోల్పోయిన హోంమంత్రి మహమూద్‌అలీ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టారు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సదరు గన్‌మెన్ మంత్రిని అలాగే చూస్తుండిపోయారు.

తర్వాత వెనుక ఉన్న వారు మంత్రి మహమూద్ అలీకి బోకే అందించారు. కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న హోంమంత్రి మహమూద్ అలీ వెంటనే క్షమాపణలు చెప్పాలని బిఎస్‌పి నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. హోంమంత్రి అయినంత మాత్రాన సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం ఏంటని పలు సంఘాలకు చెందిన బాధ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హోం మంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News