Tuesday, January 21, 2025

స్వప్నలోక్‌ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని రాష్ట్రం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడిన విషయం విధితమే. అయితే పోస్టుమార్టుం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా శుక్రవారం హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీలతో పాటు పలువురు ఉన్నతాధికారులు గాంధీ ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్పారు. ఈ సందర్భంగా మహమూద్ ఆలీ మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న చిన్న వయస్సు కలిగిన పిల్లల మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

మృతులకు ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం అందించనున్నట్టు తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణమైన స్వప్నలోక్ కాంప్లెక్స్ అసోసియేషన్ సభ్యులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా గోదాములు, వ్యాపార సముదాయాలను నడుపుతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. ఎలాంటి నియమ నిబంధనలను పాటించకుండా అగ్ని ప్రమాదానికి కారణమైన స్వప్నలోక్ కాంప్లెక్స్‌ను సీజ్ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవాసాల మధ్య నెలకొల్పుతున్న వాణిజ్య సముదాయాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, నిబంధనలకు విరుద్ధ్దంగా నడుస్తున్న వాణిజ్య సముదాయాలను సీజ్ చేయాలని ఆదేశించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News