- Advertisement -
న్యూఢిల్లీ: రాజస్తాన్ ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య హత్యపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఐసిస్ ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎన్ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) విచారణకు ఆదేశించింది. కన్హయ్య హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను ఉరితీయాలని డిమాండ్ పెరుగుతోంది. బిజెపి నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగినట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ఆ వీడియోలను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజి స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి ఉదయ్ పూర్ కు చేరుకుని పరిశీలించినట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -