Thursday, January 9, 2025

ఇంటి పర్మిషన్లు ఇక ఈజీ

- Advertisement -
- Advertisement -

భవనాలు, లే ఔట్ల అనుమతుల
కోసం కొత్త విధానం ఫిబ్రవరి
1వ తేదీ నుంచి ‘బిల్డ్ నౌ ’
విధానం అమల్లోకి… స్థిరాస్తి
రంగంలో హైదరాబాద్ టాప్‌లో
ఉంది ఐటీ, పరిశ్రమల శాఖ
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మన తెలంగాణ/హైదరాబాద్: భవనాలు, లే ఔట్ల అనుమతులు, ఆక్యుపెన్సీ పత్రాల జారీ, భూ వినియోగ మార్పిడి వంటి సేవల పరిష్కారానికి ప్రభుత్వం ‘బిల్డ్ నౌ ’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం మంది జనాభా పట్టణాలు, నగరాల్లోనే నివసిస్తున్నందున భవన నిర్మాణంపై సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టరాని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన పలు విషయాలను మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాలను కొనసాగిస్తూనే ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ టాప్‌లో ఉందని, 11 శాతం గ్రోత్ రేట్‌ను సాధించిందని మంత్రి తెలిపారు. ఇక్కడ నివసించే ప్రజలే అధికంగా గృహ నిర్మాణాలు చేపడుతూ గృహ రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

1,30,000 గృహ అవసరాల యూనిట్స్‌కు డిమాండ్
రాజకీయ సిద్ధాంత పరంగా తమకు విభేదాలు ఉన్నా రాష్ట్రం కోసం చేసే అభివృద్ధి పనులను ఇంకా మెరుగ్గా ముందుకు తీసుకెళతామని ఆయన తెలిపారు. 467 మంది అల్ట్రా హై నెట్‌వర్క్ ఉన్న కుటుంబాలు మన హైదరాబాద్‌లో ఉన్నాయని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ సంఖ్య బెంగళూర్ కన్నా ఎక్కువ అని ఆయన అన్నారు. 10 లక్షలమంది ఐటీ ఉద్యోగులు మన హైదరాబాద్‌లోనే పని చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్లోబల్ కెపబులిటీ సెంటర్లు కంపెనీలు అన్ని హైదరాబాద్‌కు పెద్దఎత్తున వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వచ్చే మూడు ఏళ్లలో నగరంలో 34 నుంచి 37 లక్షల మిలియన్ ఎస్‌ఎఫ్‌టి ఏరియా అవసరం ఉందన్నారు. 1,30,000 గృహ అవసరాల యూనిట్స్‌కు కూడా డిమాండ్ పెరుగుతుందన్నారు.

కొత్త భవన నిర్మాణాలు, లే ఔట్‌ల అనుమతులు 22 శాతం
2024 సంవత్సరంలో కొత్త భవన నిర్మాణాలు, లే ఔట్‌ల అనుమతులు 22 శాతం పెరిగాయన్నారు. 2024 లో ప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాలకు సంబంధించి మొదటి 5 స్థానాల్లో హైదరాబాద్ ఉందన్నారు. భవిష్యత్‌లో మొదటి స్థానం హైదరాబాద్ ఉండేలా సిఎం రేవంత్ లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ఏఐ ఆధారిత ఆన్‌లైన్ బిల్డింగ్, లే ఔట్ అప్రూవల్ పోర్టల్ సేవలు తెలంగాణ ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు. డ్రాయింగ్ అప్రూవల్‌కు చాలా రోజుల సమయం పడుతుందని, ప్రస్తుతం తాము తీసుకొచ్చే ఈ కొత్త విధానం ద్వారా త్వరగా అనుమతులు మంజూరు అవుతా యని ఆయన తెలిపారు. అక్యుపెనీ సర్టిఫికెట్స్ జారీ, అనధికార నోటీసుల జారీకి చెక్ పెట్టడానికి ‘బిల్డ్ నౌ ’ పేరుతో అప్లి కేషన్ తీసుకురావాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.

ఈ అప్లికేషన్ దేశంలోనే అత్యంత వేగవంతమైన అప్రూవల్ పోర్టల్ గా మారనుందన్నారు. ఏఐ అసిస్టెన్స్ ద్వారా వాట్సాప్ చాట్ ద్వారా పూర్తి సమాచారం పౌరులు తెలుసుకోవచ్చన్నారు. ప్రాపర్టీ కి సంబంధించి అనుమతి, డిజైన్స్, లీగల్ డాక్యుమెంట్స్, జిఓ వివరాలు కూడా తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. అన్ని బిల్డింగ్‌ల సమాచారం ఒకే సర్వేలో ఉంచడంతో ప్రజలు తమకు కావాల్సిన సంచారం తెలుసుకోవచ్చన్నారు. బ్యాంక్ లు ఎటిఎంలో ఏర్పాటు చేసినట్టు ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. నాన్ హైరైజ్ బిల్డింగ్ అనుమతికి సంబంధించి సమయం 22 రోజుల నుంచి 15 రోజులకు తగ్గుతుందని, డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా ఈ ఏఐ ఆధారిత సేవలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2025 నుంచి అందుబాటులోకి రానున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హెచ్‌ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డిటిసిపి ఇన్‌చార్జీ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News