Thursday, December 19, 2024

వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్‌కు కన్నాయిగూడెం జర్నలిస్టుల వినతి

కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యటించారు. నిరుపేదల కుటుంబంలో ఉంటు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిస్వార్థంగా జర్నలిజంలో పనిచేయడం జరుగుతుందని తమకు మండల కేంద్రంలో ఇంటి స్థలాలు కేటాయించి తమను ఆదుకోవాలని కన్నాయిగూడెం వర్కింగ్ జర్నలిస్టులు బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు.

దీనితో స్పందించిన కలెక్టర్ ప్రభుత్వం నుండి ఆదేశాలు రాగానే వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం వర్కింగ్ జర్నలిస్టులు నాగరాజు, రాజబాబు, శాయక్, రాజు, మల్లేష్, శ్యామ్, మహేష్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News