అట్టహాసంగా ఇండ్ల పంపిణీ
గ్రేటర్ పరిధిలో 9 ప్రాంతాల్లో 11,700 మంది లబ్ధిదారులకు అందజేత
బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లయినా ఇచ్చారా?
రూ.60 లక్షల విలువైన ఇళ్లను ఉచితంగా ఇస్తున్న ఘనత కెసిఆర్‌దే
సంపన్నుల ఇలాకాలో పేదల ఆత్మగౌరవ భవనాలు
కొల్లూరులో.. పట్టాల పంపిణీలో మంత్రి హరీశ్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ :నిరుపేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులు, అధికారులు శనివారం ఘనంగా నిర్వహించారు. శనివారం 11,700 మంది లబ్ధిదారులకు ఇళ్లను అం దించారు. గ్రేటర్ పరిధిలోని 9 ప్రాంతాల్లో మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజా ప్రతినిధులు క లిసి 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఈ ఇ ళ్లను అందచేశారు. రానున్న 10 రోజుల్లో మిగతా ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు తెలిపారు. తొలిదశలో ఇళ్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా కలెక్టర్‌ల పర్యవేక్షణలో లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు ప్రభుత్వం తెలిపిం ది. మంజూరు పత్రాలను అందుకున్న లబ్ధిదారులు ఎప్పుడైనా గృహప్రవేశం చేసుకోవచ్చని వారికి సూచించింది.
గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్‌రూంల నిర్మాణం
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచనలో భాగంగా నిరు పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారు ఆత్మగౌరవంగా జీవించడమే లక్ష్యంగా గ్రేటర్ వ్యాప్తంగా లక్షా డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో ప్రస్తుతం వరకు 70 వేల పై చిలుకు ఇళ్ల పూర్తి కావడంతో వాటిని దశల వారీగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. దీనికోసం అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదటి దశ కింద జిహెచ్‌ఎంసి పరిధిలో 24 నియోజకవర్గాల్లో శనివారం 11,700 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించారు. ఇందుకు ప్రతి నియోజకవర్గం నుంచి 500 చొప్పున ఎం పిక చేసిన లబ్ధిదారులకు జిహెచ్‌ఎంసి పరిధిలో 9 ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఈ ఇళ్లను అందజేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్‌పల్లిలో నిర్వహించనున్న డబుల్‌బెడ్ రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మొత్తం 1700 మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఇందులో భాగంగా గాజులరామారంలో 144, బహదూర్ పల్లి 356, గృహాలను కుత్బుల్లాపూర్ ని యోజకవర్గానికి చెందిన 500 మందికి వీటిని పంపిణీ చేస్తారు. అదేవిధంగా డి-పోచంపల్లిలో నిర్మించిన 1200 ఇళ్లల్లో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 200 మంది లబ్దిదారులకు, సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన 500 మందికి, కూకట్ పల్లి నియోజకవర్గానికి చెందిన 500 మంది లబ్దిదారులకు ఈ ఇళ్లను మంత్రులు పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో 216, సాయి నగర్‌హఫీజ్ పేట్‌లో 120 మొత్తం 344 ఇళ్లను మంత్రులు ఇదే నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
కొల్లూర్-1 లొకేషన్‌లో..
పటాన్ చెరు నియోజకవర్గంలోని కొల్లూర్-1 లొకేషన్‌లో 3,300 మంది లబ్ధిదారులకు ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్ రావుకు ఇళ్లను పంపిణీ చేశారు. ఇం దులో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి200ల మంది, జూబ్లీహిల్స్ నుంచి 500ల మంది, శేరిలింగంపల్లి నుంచి 156 మందికి, రాజేంద్రనగర్ నుంచి 144 మం దికి, ప టాన్ చెరు నుంచి 500 మందికి ఈ ఇళ్లను అందించారు. అమీన్ పూర్-2 లో నిర్మించిన 1800 ఇళ్లలో గోషామహల్‌కు చెందిన 500లమంది, నాంపల్లికి చెందిన 500ల మంది,కార్వాన్ నుంచి 500ల మంది, ఖైరతాబాద్ నుం చి300ల మంది ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఉప్పల్ నియోజకవర్గంలోని 500 ఇళ్లను….
ఉప్పల్ నియోజకవర్గం శ్రీనగర్‌కాలనీ సర్వే నెం.710/పి ప్రాంతంలో నిర్మించిన 500 ఇళ్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలబ్ధిదారులకు అందజేశారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని 1,000 ఇళ్లు…..
మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రతాప్ సింగారంలో 1, 000 ఇళ్లను ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 500ల మం దికి, అంబర్‌పేట్ నియోజకవర్గంకు చెందిన 500 మంది లబ్ధిదారులకుడిప్యూటీస్పీకర్‌పద్మారావు పంపిణీ చేశారు.
మంఖాల్- ప్రాంతంలో 2,230 ఇళ్లు….
మంఖాల్- ప్రాంతంలో నిర్మించిన 2,230 ఇళ్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణీ చేశారు. ఇందు లో మాంఖాల్-1 లోని 500 ఇళ్లను మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు, మాంఖాల్-2 లో నిర్మించిన 1,730 ఇళ్లను మలక్‌పేట్, యాకత్‌పుర ని యోజవర్గాలకు చెందిన 500ల మందికి చొప్పున మొ త్తం 1,000 మందికి, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన 230 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఫారూక్ నగర్‌లో నిర్మించిన 770 ఇళ్లు…
చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి చెందిన బండ్లగూ డ సర్వే నెం.82, 83/తో పాటు బహదూర్‌పుర ని యోజకవర్గం పరిధిలోని ఫారూక్ నగర్‌లో నిర్మించిన మొత్తం 770 ఇళ్లను హోంమంత్రి మహమూద్ అలీ లబ్ధిదారుల కు పంపిణీ చేశారు. బండ్లగూడలోని 270 ఇళ్లను చాం ద్రాయణగుట్ట నియోజకవర్గం ప్రజలకు ఫారూక్‌నగర్‌లో నిర్మించిన 500 గృహాలను బహదూర్ పుర నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గంలో…
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగిలో 196, బైరాగి గూడ-లో 160 మొత్తం 356 ఇళ్లను మంత్రి పి. మహేందర్‌రెడ్డి ఆ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అహ్మద్‌గూడ ప్రాంతలో…
మేడ్చల్ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడ ప్రాంతలో ని ర్మించిన 1,500 ఇళ్లను మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో మల్కాజ్ గిరి 500ల మందికి, ముషీరాబాద్‌కు చెందిన 500ల మం దికి, సికింద్రాబాద్‌కు చెందిన 500 మంది లబ్దిదారులకు ఈ ఇళ్లను అందచేశారు.