Monday, January 20, 2025

హోండా మోటార్ సైకిళ్ల రీకాల్

- Advertisement -
- Advertisement -

హోండా సంస్థకు చెందిన H’nees CB 350, CB 350RS మోటార్ సైకిళ్లను కంపెనీ రీకాల్ చేస్తోంది. మోటార్ సైకిల్ కు వెనుకన ఉండే లైట్ స్విచ్ వద్ద రబ్బరు పార్టు తయారీలో నాణ్యతాలోపాన్ని గుర్తించామని, దానిని సరిచేయకపోతే నీళ్లు లోపలికి వెళ్లే అవకాశం ఉందని హోండా కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆ భాగాన్ని రిపేర్ చేసి ఇచ్చేందుకు వీలుగా 2020 అక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్యకాలంలో అమ్ముడైన వాహనాలను వెనక్కి రప్పిస్తున్నామని పేర్కొన్నారు. దీనికిగాను కస్టమర్లకు ఎలాంటి చార్జీలు విధించబోమన్నారు. హోండాకు చెందిన బిగ్ వింగ్ డీలర్ షిప్ కేంద్రాల్లో డిసెంబర్ రెండోవారంనుంచి మరమ్మతులు చేపడతామని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News