ప్రముఖ వాహనాల కంపెనీ హోండా కొత్త అప్‌డేట్‌లతో హోండా ఎస్పీ125ని మార్కెట్లో విడుదల చేసింది. అదే సమయంలో కంపెనీ కొత్త అప్‌డేట్‌లతో హోండా ఎస్పీ160ని కూడా తీసుకొచ్చింది. ఈ బైక్ సింగిల్ డిస్క్, డబుల్ డిస్క్ అనే రెండు వేరియంట్లలో తీసుకురాబడింది. అంతేకాకుండా.. రేడియంట్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ అనే నాలుగు రంగుల్లో మార్కెట్లోకి వచ్చింది. హోండా ఎస్పీ160 ఎలాంటి కొత్త అప్‌డేట్‌లతో వచ్చిందో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
హోండా ఎస్పీ160 మస్కులర్ డిజైన్‌లో ఎటువంటి మార్పు లేదు. అయితే దీని గ్రాఫిక్స్‌లో స్వల్ప మార్పులు చేశారు. ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 162.71cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ 13.18PS శక్తిని, 14.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ మునుపటిలాగా 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
కొత్త హోండా ఎస్పీ160 బైక్ లో అనేక కొత్త ఫీచర్లను జోడించారు. ఈ బైక్‌లో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, SMS హెచ్చరికలు, హోండా రోడ్‌సింక్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మ్యూజిక్ ప్లేబ్యాక్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కొత్త 4.2-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. బైక్‌లో కొత్త LED హెడ్‌లైట్‌తో పాటు USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.
ఈ బైక్ మునుపటిలాగే టెలిస్కోపిక్ ఫోర్క్, మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ సెటప్‌లో డబుల్ డిస్క్ వేరియంట్‌లో 276 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 220 mm వెనుక డిస్క్ బ్రేక్ ఉన్నాయి. దీని సింగిల్ డిస్క్ వేరియంట్‌లో 130 మిమీ వెనుక డ్రమ్ బ్రేక్ ఉంది. ఇందులో 17 అంగుళాల టైర్లను అమర్చారు.
హోండా ఎస్పీ160 బైక్ సింగిల్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,21,951గా పేర్కొంది. అదేవిధంగా డబుల్ డిస్క్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,27,956 గా నిర్ణయించింది.