Monday, December 23, 2024

హోండా మోటార్ సైకిళ్ల రీకాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొన్ని ద్విచక్ర వాహనాలను రీకాల్ చేసింది. 350 సీసీ సెగ్మెంట్లో ఆ కంపెనీ తీసుకొచ్చిన సీబీ350, సీబీ350ఆర్‌ఎస్ మోడల్ మోటార్ సైకిళ్లను రీకాల్ చేసింది. ఒక పార్టులోని లోపాన్ని తనిఖీ చేసి సరిచేసి ఇచ్చేందుకు ఈ రీకాల్ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. ఎన్ని బైకులు రీకాల్ చేసింది మాత్రం హోండా వెల్లడించలేదు. వెనుక వైపు స్టాప్ లైట్ స్విచ్‌కు సంబంధించిన రబ్బర్ పార్ట్ తయారీలో లోపం ఉందని హోండా గుర్తించింది.

దీనివల్ల రబ్బర్‌లో క్రాక్ వచ్చే అవకాశం ఉందని, దానివల్ల స్విచ్ లోపలికి నీరు చేరే అవకాశం ఉందని పేర్కొంది. 2020 అక్టోబర్ నుంచి 2023 జనవరి మధ్య తయారైన వాహనాల్లో ఈ లోపం ఉన్నట్లు హోండా ఓ ప్రకటనలో తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు హోండా తెలిపింది. హోండాకు చెందిన బిగ్‌వింగ్ డీలర్‌షిప్ కేంద్రాల్లో డిసెంబర్ రెండో వారం నుంచి పార్ట్‌ను మారుస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం వాహనదారులు ఎలాంటి రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వారెంటీ ఉన్నా లేకపోయినా ఫ్రీగానే పార్ట్ రీప్లేస్ చేస్తామని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News