Thursday, January 23, 2025

రాజకీయాల్లోకి నిజాయితీపరులు రావాలి

- Advertisement -
- Advertisement -

పవిత్రమైన సేవ వ్యాపారంగా మారుతోంది
నేటి రాజకీయాల్లో యువతకు అవకాశాలు ఇవ్వాలి
నిజాయితీగా పనిచేసిన నాయకులే స్పూర్తి
మాజీ సిబిఐ జెడీ లక్ష్మినారాయణ సూచనలు

మన తెలంగాణ/ హైదరాబాద్ : నిజాయితీ ఎమ్మెల్యేలను సన్మానించుకోవడం వలన ఒక రకమైన ఆనందం కలుగుతుంది, అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవని బాధ కలుగుతోందని మాజీ సిబిఐ జేడీ లక్ష్మినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ పల్నాటి రాజేందర్ ఆధ్వర్యంలో నిజాయితీగా ప్రజలకు సేవలందించిన ఐదురుగు ఎమ్మెల్యేలను సత్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి కాని మార్పు కోసం మన ఆలోచన క్రోడీకరించాలని, బాబా సాహెబ్ అంబేద్కర్ మిమ్ములను కాపాడుకోవడానికి మీకు ఏలాంటి ఆయుధం ఇవ్వలేదని మీకు ఓటు అనే ఆయుధం ఇచ్చాను ఓటును అమ్ముకొని బానిసలు అవుతారా, సరిగ్గా ఉపయోగించుకొని రాజులవుతారా మీరే ఆలోచించుకోవాలి అన్నట్లు తెలిపారు.

మంచి మార్పుకు ప్రధానం అందరూ ఓటు వేయాలనే ఆలోచన తీసుకురావాలి. ఒకప్పుడు రాజకీయం అంటే అది ఒక పవిత్రమైన కార్యంగా ఉండేది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నీతిగా, నిజాయితీగా పనిచేసేవారు. కులాలు, మతాలు అనేవి పట్టించుకోకుండా ప్రజల అభివృద్ది కోసం మాత్రమే పనిచేసేవారని పేర్కొన్నారు. అనంతంర సంగీత దర్శకుల ఆర్పీ పట్నాయక్ ప్రసంగిస్తూ రాజకీయం అంటే నేడు అసహ్యించుకునే స్థాయికి వచ్చిందని, ప్రజల కోసం పనిచేయడం కంటే పగలు, ప్రతీకారాలే నేడు ప్రాధాన్యం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటేసిన ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే, అదే ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు మాత్రం ప్రజల బాధలు, కష్టాలు పట్టించుకోకుండా అధికారమే పరమావధిగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలను మార్చాల్సిన అవసరం మనందరిపై ఉందని, మళ్లీ మనదేశంలో ఇలాంటి నీతి, నిజాయితీ పరుల సంఖ్య పెరగాలని దానిని పెంచే ప్రయత్నం యూత్ ఫర్ యాంటీ కరప్షన్ చేయాలని కోరారు.

ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఎ. విఠల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యె రామాయంపేట,కొండిగారి రాములు మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం, కొమ్మిడి నర్సింహరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భువనగిరి,బక్కని నర్సింహులు మాజీ ఎమ్మెల్యే షాద్ నగర్,డి. సురేందర్ రావు మాజీ ఎమ్మెల్యే జగిత్యాల వీరిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెలక్షన్ కమిటి చైర్మన్ దన్నపునేని అశోక్ కుమార్, మాధవ రెడ్డి, యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మీడియా ఇంచార్జ్ జయరాం, సభ్యులు డా. స్రవంతి, కొమటి రమేశ్ బాబు, కొన్నె దేవేందర్, జి. హరి ప్రకాశ్, కానుగంటి రాజు, బత్తిని రాజేష్, ప్రవీణ్, రాజ్ కుమార్, గంగాధర్, చింతల్ రమేష్, జి. హరిప్రకాశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News