Saturday, November 16, 2024

నిజాయితీ నా నైజం… అభివృద్ధి నా ఎజెండా

- Advertisement -
- Advertisement -
  • అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా
  • కాంగ్రెస్ పసలేని హామీలను నమ్మొద్దు
  • ఆత్మీయ సమావేశాల్లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జఫర్‌గడ్: 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటూ నిజాయితే నైజంగా, అభివృద్ధే ఎజెండాగా పని చేస్తున్నానని స్టేషన్ ఘన్‌పూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని కూనూరు, రఘునాధ్‌పల్లి, ఉప్పుగల్లు, తమ్మడపల్లి (ఐ), తిమ్మంపేట్‌తోపాటు నియోజకవర్గ పరిధి ఐనవోలు మండలంలోని గర్మిళ్ళపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు కడియం హాజరై మాట్లాడారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అభివృద్ధి పనులు, పదవుల విషయంలో లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే మీ ముందుకు రాకుండా వెళ్ళిపోతాను. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవే లక్షంగా పనిచేశాను. సిఎం కెసిఆర్ ఆశీర్వదించి బిఫామ్ అందచేశారు. మరొక సారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా. 9 ఏళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రాష్ట్ర ఆదాయం పెరిగింది. నాడు అన్నమో రామచంద్ర అన్న తెలంగాణా నేడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మారింది. పెరిగిన ఆదాయానికి అనుగుణంగా సంక్షేమ పథకాలను పెంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.

టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యవసాయానికి కేవలం మూడు గంటల కరెంటు సరిపోద్ది అంటున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇచ్చే మూడు గంటల కరెంటు కావాలా ? బిఆర్‌ఎస్ ఇచ్చే 24 గంటల కరెంటు కావాలో ప్రజలు ఆలోచించాలని, అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేయ్యాలని కడియం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపిపి రడపాక సుదర్శన్, జడ్పిటిసి ఇల్లందుల బేబి శ్రీనివాస్, పిఏసిఎస్ ఛైర్మన్ తీగల కర్ణాకర్ రావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుజ్జరి రాజు, నాయకులు బానోతు రాజేశ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు పి జైపాల్ రెడ్డి, రైబస మండల కోఆర్డినేటర్ కడారి శంకర్, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు గాదెపాక అయోధ్య, ఇల్లందుల శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బొమ్మినేని శ్రీదేవి పెద్ది రెడ్డి, ఇల్లందుల కుమార్, గాదెపాక సువర్ణ, గాదెపాక అనిత సుధాకర్, మంద మల్లయ్య, నాయకులు కుల్లా మోహన్ రావు, గ్రామశాఖ అధ్యక్షులు అశోక్, రాజ్ కుమార్, నరేశ్, మల్లేశ్ , నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News