Sunday, December 22, 2024

అన్నదమ్ములపై తేనెటీగల దాడి.. ఈత రాక అన్న మృతి

- Advertisement -
- Advertisement -

నీలంపల్లి: మహబూబాబాద్ జిల్లాలో నీలంపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. పొలం పనులకు వెళ్లిన అన్నదమ్ములపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అన్నదమ్ములు వ్యవసాయ బావిలో దూకారు. ఈ ప్రమాదంలో ఈత రాక అన్న మృతిచెందాడు. తమ్ముడు జనార్దన్ ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News