- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో హాంకాంగ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిప్ 20వ తేదీ నుంచి మే 3 వరకు భారత్ మీదుగా హాంకాంగ్ వెళ్లే విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ తేదీల్లో పాకిస్తాన్, ఫిలిఫీన్స్ నుంచి బయల్దేరే విమానాలపై కూడా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెలలో రెండు విస్తారా విమానాల్లో ప్రయాణించిన 50 మంది ప్రయాణికులకు కోవిడ్-19 సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.అటు దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,73,810 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1619 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Hong Kong Bans India Flight
- Advertisement -