Monday, December 23, 2024

బాలాపూర్ లో పరువు హత్య.. యువతి కళ్లెదుటే …

- Advertisement -
- Advertisement -

బాలాపూర్: మతాంతర ప్రేమ వ్యవహారం నేపధ్యంలో యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు… నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కేస్లీతండాకు చెందిన డెగావత్ ఫూల్‌సింగ్ తన భార్య,కుమారుడు పవన్(18),ఇద్దరు కుమార్తెలతో కలిసి బతుకుదెరువు కోసం నగరశివారు ప్రాంతం అయిన బాలాపూర్ పొలీస్‌స్టేషన్ పరిధిలోని షాహీన్‌నగర్ వాదే హి ఒమర్ బస్తీలో నివాసం ఉంటున్నాడు.

కాగా ఇంటర్మీడియట్ పూర్తిచేసిన పవన్‌కు స్థ్ధానికంగా నివాసం ఉండే ఓ ముస్లిం యువతితో ఏడాది కాలంగా ప్రేమవ్యవహారం కొనసాగుతుందని,ఈ విషయంపై పవన్,యువతి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న క్రమంలో ఈనెల 8వ తేదీన సాయంత్రం పవన్ కుటుంబ సభ్యులు,యువతి బుందువుల మధ్యలో డబ్బుల సెటిల్‌మెంట్‌కు సంబంధించి గొడవలు జరిగాయని తెలిపారు.ఇదిలాఉండగా అదేరోజు రాత్రి సుమారు 11:40 గంటల సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన పవన్‌పై అప్పటికే అతని ఇంటి వద్ద మాటువేసిన యువతి బాబాయ్ గౌస్,సద్దాం అనే వ్యక్తితో కలిసి కత్తులతో విచక్షనారహితంగా దాడిచేసి గాయపర్చడంతో భయ,భ్రాంతులకు గురైన పవన్ ఇంట్లోకి పరుగులు తీశాడు.

కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎన్స్‌స్పెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News