Wednesday, January 22, 2025

ప్రేమ వివాహం… నడిరోడ్డుపై వేటకోడవళ్లతో నరికి

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/కర్నూల్ న్యూస్: ప్రేమ వివాహం చేసుకుందని కూతురి భర్తను నడిరోడ్డు వేటకోడవళ్లతో నరికిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మురవణి గ్రామంలో సుకన్య(24), వీరేశ్(28)గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ల ప్రేమను సుకన్య కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ప్రేమ పెళ్లి చేసుకొని ఎమ్మిగనూరులో దూరంగా ఉంటున్నారు. సుకన్య స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ పద్దతిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. వీరేశ్ ప్రతీ రోజు ఆమె డ్యూటీ దగ్గర వదిలి వెళ్లేవాడు. గురువారం సాయంత్రం తన భార్యను ద్విచక్రం వాహనంపై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఆమె తండ్రి ఉస్సేన్, బంధువుల ఆటోతో ఢీకొట్టారు. అనంతరం వేటకోడవళ్లు, కత్తులతో వీరేశ్‌పై విచాక్షణరహితంగా దాడి చేశారు. అతడు చనిపోయాడునుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. భయంతో సుకన్య పరుగులు తీసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చేసరికి వీరేశ్ ను స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. అతడు ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News