Sunday, December 22, 2024

ఆస్కార్ గ్రహీత చంద్రబోస్‌కు ఘన సన్మానం

- Advertisement -
- Advertisement -

చిట్యాల: ఆస్కార్ గ్రహీత చంద్రబోస్‌కు తమ స్వగ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్లగరిగ గ్రామంలో ఆదివారం పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. తొలుత స్వగ్రామానికి చేరుకున్న కనుకుంట్ల చంద్రబోస్ సుచిత్ర దంపతులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి పూర్వ విద్యార్థులు,అభిమానులు గ్రామస్తుల మధ్య ర్యాలీగా హైస్కూల్‌లో నిర్వహించిన అభినందన సభకు చేరుకున్నారు. అభిమానులు బాణాసంచాలు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ పండుగ వాతావరణంలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ కర్రె మంజుల అశోక్ రెడ్డి ఎంపీపీ దావు వినోద వీర రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి గ్రామస్తులు బాల్య స్నేహితులు పూర్వ విద్యార్థులు గురువులు బొకేలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు గ్రామస్తులు స్నేహితులు మాట్లాడుతూ చల్లగరిగ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన చంద్రబోస్ తమ ఊరివాడు కావడం తమతోటి చదువుకున్నవాడు కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. తమతో చదువుకొని బీటెక్ పూర్తి చేసి సినీ గేయ రచయితగా 1995లో సినిమా పాటలు రచయితగా రంగ ప్రవేశం చేసి నేడు త్రిబుల్ ఆర్ సినిమాకి నాటు నాటు అనే పాట రచించి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు. గతంలో నంది, సినిమా, అవార్డులు అందుకున్నారని పేర్కొన్నారు. మారుమూల గ్రామమైన చల్లగరిగ గ్రామాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన తమ ఊరి పాటల చంద్రుడు కి సన్మానం సత్కారం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి పాటలు మరెన్నో రచించి మరెన్నో పేరు ప్రఖ్యాతలుగాంచాలని వారు ఆకాంక్షించారు.

అంతరం చంద్రబోస్ మాట్లాడుతూ నాటు నాటు పాటకు ప్రపంచ స్థాయిలో ఇంత గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అగ్ర దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచ స్థాయిలో అభిమానులు నీరాజనం పట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతమైన పాటలను రచించి తెలుగు సినిమాను మరింత పేరు కేథలు తీసుకు వస్తానన్నారు. చల్లగరిగ గ్రామంలోనీ వాతావరణన్ని అనుసరించే ఈ పాటను రాయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు ప్రజలు పూర్వ విద్యార్థులు తోటి స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News