Sunday, December 22, 2024

సిఐ మురళీని ఘనంగా సన్మానం

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర లోని సుదీర్ఘ కాలం పాటు పోలీసు సేవలు అందించి మధిర నుండి బదిలీ అయ్యి వెళ్తున్న సిఐ మురళీని ప్రముఖ వైద్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పొంగులేటి శ్రీనన్న మధిర నియోజకవర్గ ఇంచార్జి డా॥ కోట రాంబాబు ఘనంగా సన్మానించారు. మధిర లోని పోలీసు అడ్మినిస్ట్రేషన్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా లా అండ్ ఆర్డర్ ను కాపాడుతూ, అతి ఎక్కువ కాలం మధిర సిఐ గా పని చేసి అన్ని వర్గాల ప్రజలకు భేదాభిప్రాయాలు లేకుండా న్యాయం చేసి ఎన్నో క్లిష్ట తరమైన కేసులను పరిష్కరించి మధిర ప్రజల మన్ననలను పొంది వారిలోని సుస్థిర స్థానం సంపాదించుకున్న ఘనత మురళీది అని కొనియాడి వారికి వీడ్కోలు పలికారు.

అదేవిధంగా మధిర లోని గతంలో రూరల్ ఎస్‌ఐ గా పని చేసి వెళ్లి ఎన్ని ప్రదేశాల్లో మంచి పోలీసు ఆఫీసర్ గా పని చేసి ఫ్రండ్లీ పోలీసు కు సరైన నిర్వచనం అయ్యి మరలా మధిర కు సిఐ గా వచ్చిన సిఐ వసంత్ కుమార్ ని సాదర స్వాగతం పలికి వారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవిషెట్టి రంగారావు , యన్నం కోటేశ్వరరావు, చావలి రామరాజు, మడుపల్లి బుజ్జి, అక్కినపళ్లి నాగేశ్వరావు , అంకె వేలాద్రి, బొడ్డు నాగేశ్వరరావు, తమ్మిశేట్టి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News