Wednesday, January 22, 2025

సైనిక వెల్ఫేర్ బోర్డు మెంబర్‌కు సన్మానం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : సైనిక వెల్ఫేర్ బోర్డు మెంబర్ తిప్పని సైదులు గురువారం ఖమ్మంలోని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయన్ను ఖమ్మం జిల్లా పెరిక సంక్షేమ సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ఆయనకు బోకె అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పెరిక సంక్షేమ సంఘం అధ్యక్షులు గజవెల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చింతల లింగేశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ కమిటి డైరక్టర్ పత్తిపాక రమేష్, ఖమ్మం నగర పెరిక సంఘం అధ్యక్షులు గజ్జల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News