Monday, December 23, 2024

ఘనంగా డా.బిఎస్‌. రావు అంతిమ యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డా. బి.ఎస్.రావు అంతిమ యాత్ర శనివారం ఘనంగా ముగిసింది. విజయవాడ తాడిగడపలోని శ్రీచైతన్య మెయిన్ క్యాంపస్ నుండి ఉదయం 8.30 గంటలకు ప్రారంభమై దాదాపు 9 కిమీ ప్రయాణించి, ఈడుపుగల్లులోని వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం 12.30 గంటలకు చేరింది. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు, పలు రంగాల ప్రముఖులు, తల్లిదండ్రులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పుర ప్రజలు ర్యాలీలో పాల్గొని అడుగడునా నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు.

వేలాదిమంది విద్యార్థులు రోడ్డుకు ఇరువైపులా చేరి జోహార్లు పలుకుతూ పూలవర్షం కురిపించారు. ప్రారంభం నుండి చివరిదాకా బాణ సంచాలతో ర్యాలీ అద్యంత బాణ సంచాలు పేల్చారు. లక్ష మందికి పైగా జనవాహిని వెంట తరలిరాగా బిఎస్‌రావు అంతిమ యాత్ర ఘనమైన వీడ్కోలతో ముగిసింది. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలను భార్య ఝాన్సీలక్ష్మిబాయి, కుమార్తెలు సుష్మ, సీమ, అల్లుడు శ్రీధర్ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అశేష ప్రజల నడుమ మనమడు ఆకాష్, మానస పుత్రుడు నాగేంద్రకుమార్ నిర్వహించారు. అక్కడికి వచ్చిన ప్రముఖులు, పూర్వ విద్యార్థులు ఆయనతో తమ అనుభవాలను పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మహామనిషి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News