Sunday, December 22, 2024

పుల్లెల గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటకలోని శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం గోపీచంద్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారత బ్యాడ్మింటన్ అభివృద్ధికి గోపీచంద్ చేస్తున్న కృషికి గుర్తింపుగా యూనివర్శిటీ గోపీచంద్‌కు డాక్టర్‌రేట్‌ను ప్రకటించింది. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ప్రతిష్టాత్మకమైన డాక్టరేట్ అవార్డు లభించడం గర్వంగా ఉందని గోపీచంద్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News