- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శాసన సభలో ఇచ్చిన హామిని నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలోని ఇమామ్, మౌజమ్‌ల గౌరవ వేతనానికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించారు. మరో 7వేల మంది ఇమామ్, మౌజమ్‌లకు గౌరవ వేతనం మంజూరు చేశారు. సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రం లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్, మౌజమ్‌ల సం ఖ్య 9,995 నుంచి 17వేలకు చేరుకుంది. వీరికి ప్రభుత్వం నెలకు రూ. 5000 గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఈ పథకా న్ని మసీదుల ఇమామ్, మౌజంలకు నెలకు రూ. 1000 గౌరవ వేతనంతో ప్రారంభించింది. ఆ తర్వాత గౌర వ వేతనాన్ని 1500 నుంచి రూ. 5,000 పెంచారు.
- Advertisement -