Wednesday, January 22, 2025

కర్ణాటకలో మరో పరువు హత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు నొక్కి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు కూడా కారకుడయ్యాడు. కర్ణాటక లోని గోల్డ్ ఫీల్డ్ (కెజిఎఫ్) లోని బంగారు పేట నివాసి కృష్ణమూర్తి తన 20 ఏళ్ల కుమార్తె కీర్తి వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్‌ను ప్రేమించిందని తెలిసి ఒప్పుకోలేదు. దీంతో తండ్రీ కూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మంగళవారం ఉదయం కృష్ణమూర్తి గంగాధర్‌తో ఉన్న సంబంధాన్ని తెగతెంపులు చేసుకోవాలని కూతురిని ఒప్పించడానికి ప్రయత్నించాడు. దీంతో మళ్లీ వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

చివరకు ఘర్షణకు దారి తీయడంతో కీర్తి గొంతుకోసి కన్నతండే చంపేశాడు. ఆపై ఆత్మహత్యగా మార్చడానికి ఆమె శవాన్ని ఫ్యాన్‌కు వేలాడ దీశాడు. తన ప్రియురాలి మరణం విషయం తెలిసి గంగాధర్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీస్‌లు కృష్ణమూర్తి ఇంటికి చేరుకుని కీర్తి మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గురైందన్న అనుమానంతో కృష్ణమూర్తిని విచారించగా అసలు విషయం బయటపడింది. తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్ కీర్తి మృతి విషయం తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీస్‌లు తెలిపారు. నిందితుడు కృష్ణమూర్తిని అరెస్టు చేసినట్టు కేజీఎఫ్ ఎస్పీ ధరణి దేవి చెప్పారు. ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News