Wednesday, January 22, 2025

కర్ణాటకలో హుక్కాపై నిషేధం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్కా విక్రయాలు, వినియోగంపై రాష్ట్రవ్యాప్తంగా కర్ణాటక ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా గురువారం ప్రకటించారు. హుక్కా వ్యసనంతో ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారని, ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తన ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.

ఈ మేరకు సిఒటిపిఎ చట్టాన్ని సవరించి నిషేధం విధించినట్టు వివరించారు. ఎక్స్ పోస్ట్‌లో ప్రభుత్వ ఉత్తర్వుల పత్రాన్ని కూడా ఆయన జత చేశారు. హుక్కా బార్‌లపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధిస్తుందని గత ఏడాది సెప్టెంబరులో దినేశ్ పేర్కొన్న విషయం తెలిసిందే . చట్టపరంగా పొగాకు వినియోగించే వారి కనీస వయసును 21 ఏళ్లకు పెంచినట్టు ఆనాడు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News